ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లు) పరిచయం • ఒక ఉద్యోగి వేరొక
పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22, 30, 31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. • ప్రభుత్వం ప్రత్యేక
ఉత్తర్వులిచ్చిన సంధర్బములో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము
వేతన స్థిరీకరణ చేయబడుతుంది. • ఉద్యోగి యొక్క
సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. F.R.22(a)(i) - అదనపు బాధ్యతలతో నియమనం • అదనపు బాధ్యతలతో
కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి
'తదుపరి పై స్టేజి' వద్ద వేతన
స్థిరీకరణ జరుగును. • వేతన స్థిరీకరణ
జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు
ఇవ్వబడుతుంది. ఉదాహరణ:21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940-78,910
స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించబడుతుంది. F.R.22(a)(ii) - అదనపు బాధ్యతలు లేని నియమనం • అదనపు బాధ్యతలు లేని
పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి "దిగువ
స్టేజి" వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. ఎ సమాన
స్టేజి:పాత స్కేలులోని మూల వేతనమునకు
సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచో అట్టి 'సమాన
స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు
తేదీ కొనసాగుతుంది. ఉదాహరణ:21,230-63,010 స్కేలులో రూ. 30,580/- వేతనం పొందుతున్న ఉద్యోగి 28,940-78,910
స్కేలు లో నియమించబడినప్పుడు అతని వేతనము రూ 30,580 వద్దనే స్థిరీకరించబడుతుంది. బి దిగువ
స్టేజి + పర్సనల్ పే:పాత స్కేలులోని మూలవేతనమునకు
సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన
వ్యత్యాసము 'పర్సనల్ పే'గా నమోదు
చేయబడుతుంది. సి మినిమం
కంటే తక్కువ:పాత స్కేలులోని మూలవేతనము నూతన
స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ
జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది. ఉదాహరణ:21,230-63,010 స్కేలులో రూ. 25,840/- పొందుచున్నచో, 28,940-78,910
స్కేలులో రూ. 28,940/- వద్ద వేతన స్థిరీకరణ
జరుగుతుంది. F.R.22(a)(iv) - పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియమనం • ఉద్యోగి పబ్లిక్
సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత
పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము
స్థిరీకరించబడుతుంది. F.R.22B - వేతన స్థిరీకరణ ఎంపికలు • వేతన స్థిరీకరణ
రెండువిధములుగా చేయవచ్చును: వాస్తవ ప్రమోషన్
తేదీనాడు ప్రమోషన్ పొందిన
పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటు తేదీనాడు • జి.ఓ.ఎం.ఎస్.నం.
145, తేది.
19.05.2009:ఉద్యోగి
ఎటువంటి ఆప్షన్ఇవ్వకుండగనే
ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో
దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను. ఉదాహరణ:21,230-63,010 స్కేలులో రూ. 28,120/- వేతనం పొందుతూ పదోన్నతి
పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/- గా
ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ
నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ. 820/- కలిపి వేతనాన్ని రూ 28,940-78,910
స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ 30,580/- గా వేతన స్థిరీకరణ జరుగుతుంది. FR 31(2) - పున:స్థిరీకరణ • సబ్ స్టాంటివ్ (క్రింది)
పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ
స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్
(పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది. ఉదాహరణ:21,230-63,010 స్కేలులో రూ. 30,580/- పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940-78,910
స్కేలులో రూ. 31,460/- వద్ద స్థిరీకరణ
జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ. 31,460/- గా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని
వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది. F.R. 26 - వార్షిక ఇంక్రిమెంటు • వార్షిక ఇంక్రిమెంటు
మంజూరుకు లెక్కించబడే కాలాలు:• Øఒక పోస్టులోని డ్యూటీ కాలము Øజీత నష్టములేని సెలవు కాలము Øఫారిన్ సర్వీసు కాలము Øజాయినింగ్ కాలము Øఅనారోగ్య కారణముపై గాని, ఉన్నత
శాస్త్ర, సాంకేతిక విద్యను అభ్యసించు కారణముపై గాని పెట్టిన
జీతనష్టపు సెలవు 6 నెలల కాలపర్యంతం లెక్కించబడుతుంది. x
Thanks ..! Please be connected with us for more info..