ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లుు
Appointment with additional responsibilities
AP RPS-2022 ప్రకారం వేతన స్థిరీకరణ నియమాలు
పరిచయం
ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22, 30, 31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది.
ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సంధర్బములో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి.
FR 22(a)(i) - అదనపు బాధ్యతలతో నియమనం
అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి 'తదుపరి పై స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగును.
వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
💡 ఉదాహరణ:
21,230-63,010 స్కేలులో ₹ 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940-78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము ₹ 28,940 గా స్థిరీకరించబడుతుంది.
FR 22(a)(ii) - అదనపు బాధ్యతలు లేని నియమనం
అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి "దిగువ స్టేజి" వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది.
📌 సమాన స్టేజి:
పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచో అట్టి 'సమాన స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.
💡 ఉదాహరణ:
21,230-63,010 స్కేలులో ₹ 30,580/- వేతనం పొందుతున్న ఉద్యోగి 28,940-78,910 స్కేలు లో నియమించబడినప్పుడు అతని వేతనము ₹ 30,580 వద్దనే స్థిరీకరించబడుతుంది.
FR 22(a)(iv) - పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియమనం
ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.
FR 22B - వేతన స్థిరీకరణ ఎంపికలు
వేతన స్థిరీకరణ రెండువిధములుగా చేయవచ్చును:
- వాస్తవ ప్రమోషన్ తేదీనాడు
- ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటు తేదీనాడు
🏛️ జి.ఓ.ఎం.ఎస్.నం. 145, తేది. 19.05.2009:
ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.
💡 ఉదాహరణ:
21,230-63,010 స్కేలులో ₹ 28,120/- వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో:
- పదోన్నతి పొందిన రోజున వేతనం ₹ 28,940/- గా ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి
- తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు ₹ 820/- చేరిచి
- వేతనాన్ని 28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా ₹ 30,580/- గా వేతన స్థిరీకరణ జరుగుతుంది
FR 31(2) - పున:స్థిరీకరణ
సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేదా ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది.
💡 ఉదాహరణ:
21,230-63,010 స్కేలులో ₹ 30,580/- పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940-78,910 స్కేలులో ₹ 31,460/- వద్ద స్థిరీకరణ జరుగుతుంది.
అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము ₹ 31,460/- గా పెరుగుతుంది.
కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము ₹ 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది.
FR 26 - వార్షిక ఇంక్రిమెంటు
వార్షిక ఇంక్రిమెంటు మంజూరుకు లెక్కించబడే కాలాలు:
ఒక పోస్టులోని డ్యూటీ కాలము
జీతము నష్టములేని సెలవు కాలము
ఫారెన్ సర్వీసు కాలము
జాయినింగ్ కాలము
⚠️ ప్రత్యేక నిబంధన:
అనారోగ్య కారణముపై గాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యను అభ్యసించు కారణముపై గాని పెట్టిన జీతనష్టపు సెలవు 6 నెలల కాలపర్యంతం లెక్కించబడుతుంది.
ఈ పత్రం AP RPS-2022 వేతన స్కేళ్ల ఆధారంగా రూపొందించబడింది
📚 ఫండమెంటల్ రూల్స్ 22, 26, 30, 31 | G.O.Ms.No.145, dt. 19.05.2009

Thanks ..! Please be connected with us for more info..