కారుణ్య నియామకము
COMPASSIONATE APPOINTMENTS
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఆధారితులకు GO 687 GAD తేదీ 31.10.1977 ద్వారా కారుణ్య నియామక సౌకర్యము కల్పించబడినది. కాలక్రమమూలో దీనిపై పలు సవరణలు వివరణలు ఇవ్వబడినవి. వాటన్నిటిని చేర్చి Memo No. 606681/Service-A/2003-1, GAD, తేదీ 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు ఇవ్వబడినవి.
కారుణ్య నియామకాలపై హైకోర్టు రాజ్యంగ విరుద్ధమని తీర్పు ఇచ్చిన సందర్భంలో GO. MS. No. 202, తేదీ. 27.04.2002 ద్వారా ఈ పథకము రద్దు చేయబడినది. వైద్య కారణములపై రిపేర్ అయిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు కొనసాగించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు GO. MS. No. 661, GAD తేదీ. 23.10.2008 ద్వారా పునరుద్ధరించబడినది.
1. కారుణ్య నియామకాలకు అర్హులైన వారు:
• మరణించిన
• గడచిన ఏడు సంవత్సరములపైగా కనిపించకుండా పోయిన
• వైద్య కారణములపై రిటైర్మెంట్కు అనుమతించబడిన తేదీ నుండి ఐదు సంవత్సరముల సర్వీసు గల ఉద్యోగి
కుటుంబములలో సంపాదన పరులు ఎవ్వరూ లేనప్పుడు వారిలో ఒకరు నియామకమునకు అర్హులు. వైద్యులు కమిటీ ఆమోదించిన నాటికి ఐదు సంవత్సరముల సర్వీసు మిగిలి ఉన్న నియామకానికి అ���్హులవుతారు.
GO.MS. No. 182, GAD, Dt. 22.05.2014 - ఉద్యోగి కనిపించకుండా పోయిన సందర్భములో పోలీస్ రిపోర్టు ఆధారం చేసుకుని సంబంధిత ప్రభుత్వ శాఖ కార్యదర్శి అనుమతితో కారుణ్య నియామకమునకు ఇవ్వబడుతుంది.
2. ఆధారిత కుటుంబ సభ్యులు:
• ఉద్యోగి భార్య లేక భర్త
• కుమారుడు లేక కుమార్తె
• ఉద్యోగి మరణించిన నాటికి ఐదు సంవత్సరముల ముందు చట్టబద్ధంగా దత్తత తీసుకొనబడిన కుమారుడు లేక కుమార్తె
• ఉద్యోగి భార్య లేక భర్త నియామకమునకు ఇష్టపడని సందర్భములో ఆ కుటుంబం పై ఆధారపడిన కుమార్తె, వివాహిత కుమార్తె, విధవరాలు అయిన కుమార్తె
• మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె మరియొక మైనరు కుమార్తె ఉన్న సందర్భములలో వారి తల్లిచే సూచించబడిన ఒకరు
• ఉద్యోగి అవివాహితుడై మరణించినప్పుడు అతని తమ్ముడు లేక చెల్లెలు కారుణ్య నియామకమునకు అర్హులు
కారుణ్య నియామకము పొందిన తదుపరి పునర్వివాహము చేసుకొన్నను ఉద్యోగంలో కొనసాగవచ్చును.
3. నియమింపబడే పోస్ట్ సాయి:
జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు గాని ఆ పోస్ట్ యొక్క స్కేలుకు మించని పోస్ట్కు గాని అంతకంటే తక్కువ ఆఫీస్ సబర్డినేట్ (అటెండర్) పోస్టుకు గాని కారుణ్య నియామాకము ఇవ్వబడును.
(రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు నియామకం ఉండదు)
ఈ కారుణ్య నియామకములో కూడా రిజర్వేషన్ అమలు జరుపబడును.
4. నియామకపు విధానం:
సాధారణ నియామక విధానముతో సంబంధము లేకనే కారుణ్య నియామకములు చేయబడతాయి. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సంవత్సరంలోగా అతని కుటుంబ సభ్యుడు నియామకము కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి.
మైనర్ పిల్లలకు ఉద్యోగి మరణించిన సంవత్సరములోగా 18 సంవత్సరముల వయస్సు నిండినప్పుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది.
సాధారణ నియామకములపై విధించబడేడి నిషేధము ఈ నియామకములకు వర్తించదు. నియామకములకు 33 సంవత్సరముల గరిష్ట పయోపరిమితి షరతు వర్తిస్తుంది.
SC, ST, BC తరగతులకు చెందిన వారికి ఐదు సంవత్సరములు మినహాయింపు ఉన్నది. ఉద్యోగి భార్య/భర్తకు కారుణ్య నియామకము ఇవ��వవల��ిన సందర్భంలో గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరములు.
వైద్య కారణములపై రిటైర్మెంట్ కోరుకున్న వారి దరఖాస్తును జిల్లా లేదా రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారముగా జిల్లా లేదా రాష్ట్ర కమిటీ సిఫారసు మేరకు నియామకాధికారి అనుమతిస్తారు. ఆ తరువాత కారుణ్య నియామకమునకై దరఖాస్తు చేసుకొనవలెను.
5. అర్హతలు:
• ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత విద్యార్హతలను కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. (GO. MS. No. 135 GAD Dated. 12.05.2014)
అయితే జూనియర్ అసిస్టెంట్ గా నియామక అర్హతైన డిగ్రీ పాసు అవుటకు ఐదు సంవత్సరంల గడువు అనుమతించబడుతుంది. (GO. MS. No. 112 GAD Dt. 18.08.2017)
గడువులోగా కావలసిన అర్హత సంపాదించలేకపోయినచో ఆ క్రింది స్థాయి పోస్టులకు నియమించబడుతారు.
• చివరి శ్రేణి పోస్టులకు వయస్సు మరియు అర్హతలు తగిన విధముగా లేనప్పుడు ముందు నియామకమునకు ఇచ్చి ఆ తదుపరి మినహాయింపును సంబంధించిన శాఖ నుండి పొందవచ్చును.
6. నియామక పరిధి:
మరణించిన ఉద్యోగి పని చేసిన యూనిట్లో నియామకము ఇవ్వబడుతుంది. ఆ యూనిట్లో ఖాళీ లేనప్పుడు ఆ కేసులను నోడల్ అధికారి అయిన ��ిల్లా కలెక్టర్కు పంపినచో ఒక క్యాలెండర్ సంవత్సరంలో 5 వరకు సూపర్ న్యుమరి పోస్టులను సృష్టించవచ్చును.
అంతకుమించి పోస్టులో అవసరమైనప్పుడు సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపబడుతాయి. ఈ కారుణ్య నియామకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో సిక్స్ పాయింట్ ఫార్ములాకు లోబడి కారుణ్య నియామకమునకు దరఖాస్తు చేస్తే ఆమె సొంత జిల్లాలో గాని భర్త ఉద్యోగము చేసిన చోట గాని ఏ ఇతర జిల్లాలో గాని నివాసముండే ప్రాంతమునకు దగ్గరలో గాని నియామకాన్ని కోరుకోవచ్చు.
Memo No. 35252/SerG/A1/2011-1 GAD Dt. 04.12.2013 ప్రకారము ఏ యాజమాన్యంలోని ఉద్యోగి మరణిస్తే అదే యాజమాన్యంలోనే వారసులకు ఉద్యోగము కల్పించాలని ఉత్తర్వులు వెలుపడ్డాయి.
7. దరఖాస్తు చేయు విధానం:
ఉద్యోగం కొరకు దరఖాస్తు Memo No. 8558/CPPQRDE 2186, Dt. 14.09.1998 ప్రకారము ఈ క్రింది పత్రములు జతపరిచి నియామక అధికారికి లేదా జిల్లా కలెక్టర్ వారికి పంపాలి:
• Copy of the representation/ application with biodata for employment
• Education qualifications
• Death certificate of deceased government employee
• Legal heir certificate
• List of family members
• No objection declaration of the other legal heirs of deceased Government employees attested by notary
• No remarried certificate
• Declaration stating that there being no other earning member in the family
• Certificate of registration in employment exchange
• Community certificate
8. ఎక్స్ గ్రేషియా చెల్లింపు:
కారుణ్య నియామకము ఇచ్చుట సాధ్యపడని సందర్భంలో:
• నాలుగవ తరగతి ఉద్యోగుల కుటుంబమునకు రూ. 500000 రూపాయలు
• నాన్ గెజిటెడ్ వారికి రూ. 800000 రూపాయలు
• గెజిటెడ్ వారికి రూ. 1000000 రూపాయలు
ఎక్స్ గ్రేషియా చెల్లించబడుతుంది.
(GO. MS. No. 114, GAD (SER.G) Dt. 21.08.2017)

Thanks ..! Please be connected with us for more info..