SPECIAL DISABLED LEAVE – ప్రత్యేక ప్రమాద సెలవు
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక సదుపాయం గురించి పూర్తి వివరాలు
ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రమాదం బారినపడి దీర్ఘకాలం మంచము పడితే 3 నెలల్లోగా ఈ సెలవు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రమాదము బారిన పడిన విషయాన్ని సంబంధిత శాఖాధిపతికి ముందే తెలియజేయాలి.
📋 ప్రధాన సదుపాయాలు
120 రోజుల పూర్తి జీతం
ప్రమాద సెలవులో మొదటి 120 రోజులకు పూర్తి వేతనం చెల్లిస్తారు
సగం జీతంతో పొడిగింపు
అవసరమైతే మిగిలిన కాలానికి సగం జీతం అందుతుంది
మెడికల్ లీవ్ అవసరం లేదు
మెడికల్ లీవ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు
ప్రత్యేక రక్షణ
విధి నిర్వహణలో గాయపడిన ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయం
📝 దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు విధానం
ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత శాఖాధిపతికి తెలియజేయాలి. అసక్తత సెలవు మంజూరు అయ్యేదాక మెడికల్ లీవ్ ను వినియోగించుకోవాలి. మంజూరు అయిన తరువాత ఈ సెలవు వినియోగాలోకి వస్తుంది.
💡 అవసరమైన దృవీకరణలు
- గేజిటేడ్ ఉద్యోగులు మెడికల్ బోర్డ్ నుంచి దృవీకరణ పత్రం
- నాన్ గేజిటేడ్ ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ దృవీకరణ
- శాఖాధిపతి నుంచి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేసే దృవపత్రం
⏱️ సెలవు మంజూరు కాలం
ప్రమాదం జరిగిన తరువాత ముందుగా 2 నెలలు ఈ సెలవు మంజూరు చేస్తారు. ఆ తరువాత కూడా ఉద్యోగి విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉంటే మల్లి ప్రభుత్వ వైద్యాధికారి దృవపత్రం తీసుకోవాలి. అప్పుడు పూర్తి స్థాయి సెలవు మంజూరు అవుతుంది.
💡 ముఖ్య విషయాలు
- ఈ సెలవు మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంది
- 120 రోజులకు పూర్తి జీతం, మిగిలిన కాలానికి సగం జీతం
- ప్రత్యేక సెలవు గరిష్టంగ 2 సంవత్సరాల వరకు మాత్రమే
- తదుపరి సెలవు అవసరమైతే ఇతర సెలవులను వినియోగించాలి
⚠️ ఈ సెలవు వర్తించని పరిస్థితులు
⚠️ గమనించవలసినవి
- విధి నిర్వహణ ముగిసాక కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగే ప్రమాదాలు
- పనిచేసే కార్యాలయ శాఖాధిపతి దృవపత్రం లేకపోతే
- ఉద్యోగి క్యాజువల్ లీవ్ లో ఉన్నప్పుడు జరిగే ప్రమాదాలు
- విధులకు హాజరైన అనుమతితో వ్యక్తిగత పనులపై బయటకు వెళ్ళేటప్పుడు
📜 ప్రభుత్వ ఉత్తర్వులు
రోడ్డు ప్రమాదాలపై తీర్పు
నివాస స్థలం నుండి కార్యాలయానికి మరియు కార్యాలయం నుండి నివాసానికి వెళ్ళేటప్పుడు జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే వైకల్యం ఈ సెలవులో చేర్చబడదు. కానీ కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి, లేదా న్యాయస్థనానికి, లేదా క్షేత్ర పని ప్రదేశానికి అధికారిక విధుల నిమిత్తం వెళ్ళేటప్పుడు జరిగే రోడ్డు ప్రమాదాలు చేర్చబడతాయి.
సూచన: G.O.Ms.No.133, F&P, Dt.10.06.81

Thanks ..! Please be connected with us for more info..