SPECIAL GRADE POST (SPP-IA, SPP-I,B) SCALE - MATTER IN TELUGU

AP Ministerial Employees
0

 

స్పెషల్ గ్రేడ్ పోస్టు (SPP-I) స్కేలు - పూర్తి  వివరములతో 

    AAS అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్, ఇది AP మరియు తెలంగాణలలోని జీతభత్యాల ఉద్యోగులకు వర్తిస్తుంది. ప్రభుత్వోద్యోగులు, అదే కేడర్‌లో నిర్ణీత వ్యవధి పూర్తయినా పదోన్నతులు పొందని వారు కూడా అర్హులైనప్పటికీ పోస్టులు, ఖాళీలు లేకపోవడంతో పదోన్నతులు పొందలేకపోతున్నారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమం కోసం సేవకులకు ఇంక్రిమెంట్లు మంజూరయ్యాయి. ఈ విధానాన్ని ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అంటారు.

     ఒక పోస్టులో 6 సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి ప్రస్తుతము తాను పొందుతున్న స్కేలు తదుపరి స్కేలు ను స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేలు గా మంజూరుచేస్తారు.

స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు - SPP-IA, SPP-IB అను రెండు భాగాలుగా విభజించారు.

    👉 ఒక పోస్టులో 12సం॥ స్కేలు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందబోవు తదుపరి ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-I స్కేలుగా మంజూరుచేస్తారు.అయితే ప్రమోషన్ పోస్టుకు కావలసిన అర్హతలు కలిగియుండాలి.12సం॥ సర్వీసు కలిగి,సర్వీసు రూల్స్ ననుసరించి తదుపరి ప్రమోషన్ లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్పెషల్ గ్రేడ్ స్కేలు తదుపరి స్కేలును SPP-IA స్కేలుగా మంజూరుచేస్తారు.

    👉 ఒక పోస్టులో 18సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందుతున్న SPP-IA/SPP-Iఆ స్కేలులోనే ఒక ఇంక్రిమెంటు అదనంగా మంజూరుచేస్తారు. దీనిని SPP-IB/SPP-IB స్కేలుగా వ్యవహరిస్తారు.

స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు(SPP-II) ఒక పోస్టులో 24సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి సర్వీసురూల్స్ ప్రకారం తాను పొందబోవు రెండవ ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు. అట్లే SAPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.
ఒకవేళ SPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి 2వ ప్రమోషన్ పోస్టులేని సందర్భంలో SPP-I స్కేలు తదుపరి స్కేలును SPP-II స్కేలుగామంజూరుచేస్తారు. అలాగే  SPP-IA స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.

Post a Comment

0Comments

Thanks ..! Please be connected with us for more info..

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!