FUNDAMENTAL RULES(F.R) నియమాలు

AP Ministerial Employees
0
ప్రభుత్వ ఉద్యోగుల FUNDAMENTAL RULES (F.R)

FUNDAMENTAL RULES (F.R)

వేతనం, సెలవులు, ప్రమోషన్లు & ఇంక్రిమెంట్లు - పూర్తి వివరణ

F.R. 12(a): నియామక నియమాలు
1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.
F.R. 12(b): ఒకే ఉద్యోగికి బహుళ పోస్ట్లు
ఒక Govt Employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించ రాదు.
F.R. 12(c): సెలవు సమయంలో నియామకం
ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.
F.R. 15(b): మెడికల్ లీవ్
ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.
F.R. 18: సెలవు పరిమితులు
Govt Appoint చేస్తే తప్ప, ఏ Employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయ కూడదు.
F.R. 18(a): పర్మిషన్ లేని సెలవు
1y కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.
F.R. 18(b): దీర్ఘకాల సెలవు
పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5y కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.
F.R. 18(c): ఫారిన్ సర్వీస్
5y కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్ లో ఉన్నపుడు అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.
F.R. 22(a): వేతన స్థిరీకరణ
ప్రస్తుత పోస్ట్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్ట్ లోకి నియమించ బడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేలు లో ఫై స్టేజి వద్ద స్థిరీకరిoచ బడుతుంది.
F.R. 22(a)(iv): APPSC ద్వారా ఎంపిక
ఒక ఉద్యోగి APPSC ద్వారా మరొక పోస్ట్ కి సెలెక్ట్ అయినపుడు పాత పోస్ట్ లోని వేతనాన్కి తక్కువ కాకుండా కొత్తగా ఎంపిక ఐన పోస్ట్ లో వేతనం స్తిరీకరిoచ బడును. కొత్త ఉద్యోగం లో చేరిన తేదీ నుంచి 1y తరువాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడును. ఇక పాత పోస్ట్ లోని ఇంక్రిమెంట్ డేట్ పోతుంది.
F.R. 22(B): పదోన్నతి వేతన స్థిరీకరణ
ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ కి పదోన్నతి పొందినప్పుడు, కింది పోస్ట్ లో పొందుతున్న వేతనానికి ఒక Notional Increment కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఫై స్టేజి వద్ద నిర్ణఇంచాలి.
పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్తిరీకరణ కై ఆప్షన్ కలిగి ఉంటాడు:
(a) పదోన్నతి వచ్చిన తేదీ
(b) కింది పోస్ట్ లో ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవటం
F.R. 24: వార్షిక ఇంక్రిమెంట్
వార్షిక ఇంక్రిమెంట్ యధాలాపంగా వస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తి కరంగా లేకపొతే ఆతని ఇంక్రిమెంట్ అపి వేయవచ్చు. ఇలా అపి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు, అలా ఎంతకాలం అపి వేస్తున్నారో అలాగే with cumulative లేదా with out cumulative effect అన్న విషయం ఉత్తర్వుల లో తెలుప వలెను.
ఉదాహరణ:
ఒక ఉద్యోగి 1.6.10న ఇంక్రిమెంట్ తీసుకున్న తరువాత పనిష్మెంట్ గా 2 ఇంక్రిమెంట్ లు ఆపారు అనుకుందాం.
(a) with cumulative effect:
ఈ విధంగా చేస్తే 1.6.13 నకు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది.
(b) with out cumulative effect:
ఈ విధంగా చేస్తే 1.6.13 నకు 3 వార్షిక Increment లు వస్తాయి. అంటే 2 వార్షిక increments arrears కోల్పోయినట్లు.
F.R. 26: ఇంక్రిమెంట్ పరిగణన
ఇంక్రిమెంట్ కి పరిగణింపబడే సర్వీస్ కి సంబందించిన షరతులు ఉన్నాయి. ఒక టైం స్కేల్ లో పని చేసిన కాలం ఇంక్రిమెంట్ కి లెక్కించ బడుతుంది. ఐతే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది.
180 రోజుల వరకు వైద్య కారణాల తో జీత నష్టపు సెలవు వాడు కొన్నపుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము Head of Department లకు ఇవ్వబడినది.
F.R. 26(a): పరీక్ష ఉత్తీర్ణత
ఏదయినా పరీక్ష పాస్ అయినందు వల్ల ఉద్యోగికి ఏదయినా హక్కు లేదా మినహాఇంపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరు అయినట్లుగా భావించాలి.
కొత్తగా ఉద్యోగం లో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్ లో చేరిన ఉద్యోగికి ఆతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరు అవుతుంది.
ఉదాహరణ:
19.12.73 నాడు ఉద్యోగం లో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 1.12.74 నకే మంజూరు అవుతుంది.
ఒక ఉద్యోగి రిటైర్ ఐన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నపుడు Pensionary Benefits కోసం Notional మంజూరు అయినట్లు భావించి లెక్కించాలి. ఐతే లీవ్ Encashment వంటి వాటికి ఇది వర్తించదు.
F.R. 44: HRA మంజూరు
ఉద్యోగి లీవ్ లో ఉన్నపుడు 4 నెలల వరకు HRA పూర్తి గా మంజూరు చేయ వచ్చును. అర్ద లేదా పూర్తి వేతన సెలవు మీద వున్న ఉద్యోగి HRA, అతడు సెలవు మీద వెళ్ళేటప్పటి వేతనం మీద లెక్కించ బడుతుంది.
F.R. 49: తాత్కాలిక బహుళ పోస్ట్లు
Govt ఒక ఉద్యోగి ని Temporary గా 2 పోస్ట్ లకి నియమించ వచ్చును.
F.R. 49(a): బహుళ పోస్ట్ల వేతనం
ఈ విధంగా 2 పోస్టులు చేస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో, ఆ వేతనం మంజూరు చేయవచ్చు.
ఉద్యోగిని అదనపు పోస్ట్ ను కూడా నిర్వహించ మన్నపుడు:
• మొదటి 3 నెలల వేతనంలో 1/5 భాగం అలవెన్సు
• తరువాతి 3 నెలలు 1/10 భాగం అలవెన్సు చెల్లించ బడుతుంది

Post a Comment

0Comments

Thanks ..! Please be connected with us for more info..

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!