CHILD CARE LEAVE
చైల్డ్ కేర్ లీవ్ - సంపూర్ణ సమాచారం
మొత్తం సెలవులు
90 రోజులు
మొత్తం సర్వీసులో
స్పెల్స్
6+ స్పెల్స్
కనీసం 6 స్పెల్స్
ప్రతి స్పెల్
15 రోజులు
గరిష్టంగా
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు? 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా?
G.O.Ms.No.209 Fin తేది: 21.11.2016 ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్స్ కు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో "6 స్పెల్స్ కు తగ్గకుండా" అన్నారు కాబట్టి 1, 2 రోజులు కూడా వాడుకొనవచ్చును.
చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా?
చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.
ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత DDO దే.
చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సమయంలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా?
వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు. కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు.
మెటర్నిటీ లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెట్టుకోవచ్చునా?
చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా Other than casual, special casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని G.O.209 లోని Rule 3(i) సూచిస్తోంది.
సర్రోగసీ, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా?
అర్హులే, 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.
భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా?
వీలు లేదు. ఇందుకు సంబంధించిన G.O.209 లో "Women Employees" అని ఉన్నది.
చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె Date of Birth సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.
పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తారా?
G.O.209 Point.3 లో ఇలా ఉన్నది: "ముఖ్యముగా మీ పిల్లల యొక్క పరీక్షల సమయములో, పిల్లల అనారోగ్య కారణాల వలన ఈ లీవ్ పెట్టవచ్చును."
కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.
చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్, సఫిక్స్ వర్తిస్తాయా?
వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.
డౌన్‌లోడ్ సెక్షన్
Application Form
చైల్డ్ కేర్ లీవ్ అప్లికేషన్
చైల్డ్ కేర్ లీవ్ అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకొనుటకు క్రింద ఇవ్వబడిన బటన్ ను క్లిక్ చేయండి.
APPLICATION DOWNLOADGovernment Order
G.O.Ms.No.209 Fin
చైల్డ్ కేర్ లీవ్ సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వు (GO) డౌన్‌లోడ్ చేసుకొనుటకు క్రింద ఇవ్వబడిన బటన్ ను క్లిక్ చేయండి.
G.O. DOWNLOADముఖ్యమైన గమనికలు
- • చైల్డ్ కేర్ లీవ్ వివాహిత మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది
- • పిల్లల వయస్సు 18 సంవత్సరాల లోపు ఉండాలి
- • సెలవు DDO ద్వారా ముందుగానే మంజూరు చేయించుకోవాలి
- • సెలవు కాలంలో పూర్తి వేతనం లభిస్తుంది

Thanks ..! Please be connected with us for more info..